ENGLISH
International Paper

రైతుకోసం స్మార్ట్ కార్డ్

మొదటి పేజిరైతుకోసం స్మార్ట్ కార్డ్

రైతుకోసం స్మార్ట్ కార్డ్ గురించి

పొలాల్లో అటవీ పెంపకమును ఒక సుస్థిర నమూనాగా చేయు దిశగా IPAPPM మరొకముందడుగు వేసి,రైతుల ఆసక్తులు సంరక్షించబడడమే అందుకు కావలసిన ముందస్తు అవసరమని అది అర్థం చేసుకొంటోంది. మార్కెట్ లోని ఏదేని వ్యవసాయోత్పాదన, దాని పంపిణీ మరియు డిమాండు సమీకరణానికి సంబంధించి ఉంటుంది. రైతు యొక్క నిఖరాదాయము ఎప్పటికీ నిర్ధారించబడలేదు మరియు ప్రతికూల పరిస్థితులనేవి రైతు యొక్క జీవితములో అసాధారణమేమీ కాదు. కలప గుజ్జు రైతులు ఇందుకు అతీతమేమీ కాదు. అయినప్పటికీ, IPAPPM దానిని ఒక తీవ్రమైన అంశముగా తీసుకొని, తనకు గల అతి పరిమిత వనరులతో సాధ్యమైనంత వరకూ ఈ నమూనా యొక్క సుస్థిరత్వానికి దోహదపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇది“రైతు కోసం స్మార్ట్ కార్డు”అనబడే పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఇది సంపూర్ణంగా స్వచ్ఛంద పథకము. కలప గుజ్జు సాగు కోసం IPAPPM, రైతులు అధిక దిగుబడిని పొందుటకై అనుసరించదగిన అత్యుత్తమ అభ్యాసాలను బోధిస్తోంది. పొలములో నిర్దిష్టమైన అభ్యాసాన్ని పాటించే రైతులకు ఈకార్డుజారీ చేయబడుతుంది. ఈకార్డుకంపెనీయొక్క డేటా బేస్ యందలి GPS సమన్వయ రికార్డింగులతో పాటుగా రైతుమరియు అతని ప్లాంటేషన్ యొక్క వివరాలనుకలిగియుంటుంది. IPAPPM CPC నుండి రైతు కొనుగోలు చేసిన నారు మొక్కల సంఖ్యతో పాటుగా ముందస్తుగా పేర్కొనబడిన ఒక ఋణ విధానము అందులో అనుసంధానమై ఉంటుంది. ఈ ఋణ సౌకర్యము యొక్క ప్రయోజనము, IPAPPM CPC నుండి తర్వాతి విడతలో అదే GPS సమన్వయ విస్తీర్ణము కొరకు నారు మొక్కలను తిరిగి కొనుగోలు చేసుకొనేటప్పుడు అందుకోబడుతుంది.

ఆ తర్వాత, ఒక నిర్దిష్టవ్యవధి 3.5 సంవత్సరాల తదనంతరము IPAPPM కు అమ్మకానికై అతడు కలపను తీసుకొని వచ్చినప్పుడు, ఈ కార్డుస్కాన్ చేయబడి, అతడు తన ప్లాంటేషన్ నుండి తెచ్చిన కలప పరిమాణము నమోదు చేయబడుతుంది. ఈ కార్డులు నేరుగా లబ్దిదారు రైతు యొక్క బ్యాంకు ఖాతాతో అనుసంధానము చేయబడతాయి. అందువల్ల, రైతుకు చేయవలసి యున్న ధనరూపములోని ప్రయోజనము (ఏదైనా ఉన్నచో) ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయమునకుఅవకాశం కల్పించకుండానే నేరుగా రైతు యొక్క ఖాతాకు బదిలీ చేయబడుతుంది. అదే సమయములో, కార్డుల వల్ల రైతులకు ఎటువంటి ఖర్చూ కాదు కానీ, తమకున్న భూముల నుండి అత్యుత్తమ దిగుబడిని పొందే విధంగా స్వంత ప్రయోజనాల కోసం వారు తమ పొలములో అత్యుత్తమ అభ్యాసాలను పాటించవలసి ఉంటుంది.

కార్డును గురించిన ప్రశ్నలు

రైతుల కార్డులేదా రైతు కోసం కార్డు అంటే ఏమిటి?

జవాబు: ఇది,IPAPPM యొక్క సభ్య రైతులను గుర్తించి IPAPPM తో దీర్ఘకాలిక ప్రాతిపదికపై అనుసంధానమయి ఉంటూసరుగుడు క్లోన్లను పెంచే వారికి ఇంటర్నేషనల్ పేపర్ APPM నుండి అందించబడే సభ్యత్వపు కార్డు.

ఈకార్డును పొందాలంటే నెరవేర్చాల్సిన ప్రాతిపదిక ఏది?

జవాబు: రాజమండ్రిలో గానీ లేదా ములగపూడిలో గానీ నెలకొల్పబడిన IPAPPM క్లోనల్ ఉత్పత్తి కేంద్రాలు (CPC) నుండి రైతు సరుగుడు క్లోన్లను కొనుగోలు చేసి, వాటిని రాజమండ్రిలోని IPAPPM మిల్లుకు 100 కి.మీ పరిధి లోపున నాటుతారు. దానితో పాటుగా, వారు మొక్కకు మరియు మొక్కకు మధ్య దూరం 2.5 మీటర్లు (వరుసల మధ్య) x 1 మీటరు (ఒక వరుసలోని మొక్కల మధ్య) ఉండేట్లుగా పాటిస్తారు, మరియు IPAPPM చే సలహా ఇవ్వబడిన ఇతర సాంకేతిక మార్గదర్శకాలను కూడా పాటిస్తారు.

ఈకార్డువల్ల రైతుకు ఏమైనా ఖర్చు అవుతుందా?

జవాబు: లేదు. మొదటగా జారీ చేసేటప్పుడు దీనిని ఉచితంగా ఇస్తారు. అంతే కాకుండా ఇది పూర్తిగా ఒక స్వచ్ఛంద పథకము.ఈ కార్డును తీసుకోవాలా లేదా అని నిర్ణయించుకోవడానికి రైతుకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. అతడు ఈ కార్డును గనక ఎంచుకొని, అతని ప్లాంటేషను అన్ని ప్రాతిపదికలనూ (పై ప్రశ్న 2 పేర్కొన్నట్లు) నెరవేర్చినట్లుగా IPAPPM టీము కనుగొన్నట్లయితే, ప్లాంటేషన్ స్థలమును భౌతికంగా పరిశీలించిన మీదట ఆ రైతు తనంతట తానుగా ఈ కార్డును పొందుతారు.

క్లోనులను నాటిన తర్వాత, రైతు తన కలపను ఈ వ్యవధి తర్వాతనే అమ్ముకోవాలనే నిర్దిష్ట కాల పరిమితి ఏదైనా ఉందా?

జవాబు: అవును. మొక్కలునాటిన తేదీ నుండి కలప అమ్మకాని కోసం 3.5 సంవత్సరాల తర్వాత ఈ కార్డు దానంతట అదే యాక్టివేట్ అవుతుంది మరియు ఆ యాక్టివేషన్ వ్యవధి తర్వాతి 1 సంవత్సరం పాటు కొనసాగుతుంది. అంటే, ఒకవేళ ఒక రైతు 2015 ఆగస్టులో గనక క్లోన్లను నాటినట్లయితే, కలప అమ్మకం కోసం అతని కార్డు 2019 ఫిబ్రవరి 1 వ తేదీనాడు యాక్టివేట్ అయి, 2020 జనవరి 31 వ తేదీ వరకూ యాక్టివేషన్ కొనసాగుతుంది.

ఋణాలు కార్డులోనికి ఎలా వెళతాయి?

జవాబు: IPAPPM CPC నుండి క్లోన్లను కొనుగోలు చేసిన మీదట, సంబంధిత ఋణాలు కార్డుకు కేటాయించబడతాయి. 3.5 సంవత్సరాల తర్వాత, రైతు కలపను కోసి దానిని IPAPPMకు అమ్మునప్పుడు, దానిని నేరుగా మిల్లులకు సరఫరా చేయునప్పుడు అతడు కార్డును తీసుకొని రావాల్సి ఉంటుంది, లేదా మిల్లు యొక్క వే బ్రిడ్జి వద్ద కార్డును స్వైపింగ్ చేసి, అతడు పంపిన కలప పరిమాణమును అప్ లోడ్ చేసుకోవడానికై మిల్లుకు కలపను తరలించే ప్రతియొక్క వాహనము వెంబడి దానిని పంపించవలసి ఉంటుంది.  తన ప్లాంటేషన్ విస్తీర్ణము (ఎకరాలలో విస్తీర్ణము ఆధారంగా) నుండి ఆశించబడే కనీస దిగుబడి పరిమాణము పూర్తి కాగానే, ఆ ఆశించిన పరిమాణము కొరకు అయిన ఋణాలు అతని కార్డుకు కేటాయించబడతాయి.

క్రెడిట్ పాయింట్లకు ఏదేని ప్రయోజనము ఎలా అనుసంధానము చేయబడుతుంది?

జవాబు: కలప కోత పూర్తి కాగానే, రైతు తన కార్డును, తాను చివరి సారి క్లోన్ మొక్కలను కొనుగోలు చేసిన CPC ఇన్-చార్జ్ (బాధ్యులు) వద్దకు తీసుకు వస్తారు. అక్కడ అతడు తన కార్డును చూపి, తర్వాతి విడతకై క్లోన్ మొక్కలను మళ్ళీ కొనుగోలు చేస్తారు. IPAPPM యొక్క క్షేత్ర సిబ్బంది అతని తాజా ప్లాంటేషన్ విడతను సందర్శించి, అతడు మళ్ళీ మొక్కలను నాటియున్నట్లుగా నిర్ధారణ చేసినప్పుడు, పొందిన ఋణాల ఆధారంగాఅంతకు మునుపటి విడతకు సంబంధించిన ప్రయోజనాలను పొందుటకై అతని కార్డు అర్హత పొందుతుంది.

ప్రయోజనము (ఏదైనా ఉన్నచో) రైతుకు ఎలా చేరుతుంది?

జవాబు: ఈకార్డుతో రైతు యొక్క బ్యాంకు ఖాతా నేరుగా అనుసంధానము చేయబడుతుంది. కలపను అందుకొన్న తర్వాత, మార్కెట్ యొక్క స్థితిని విశ్లేషణ చేయడం మరియు సభ్యులైన రైతులకు అవసరమయ్యే మద్దతును నిర్ణయించడమనేది IPAPPM యొక్క విచక్షణపై ఆధారపడి ఉంటుంది. దాని ఆధారంగా ఒక్కో క్రెడిట్ పాయింటుకు అందే ప్రయోజనాన్ని IPAPPM నిర్ధారిస్తుంది. అది నేరుగా రైతు యొక్క ఖాతాలోనికే వెళ్ళి జమ అవుతుంది.

కలప కోతకు వచ్చే సమయానికి, దానిని IPAPPM కు మాత్రమే అమ్మితీరాలనే నిబంధనకు రైతు కట్టుబడి ఉండాల్సి ఉంటుందా?

జవాబు: లేదు. ఆ సమయములో ఉన్న మార్కెట్ ధర ఆధారంగారైతు తాను స్వంతంగా నిర్ణయం తీసుకొని కలపను ఏ పరిశ్రమకయినా అమ్ముకోవచ్చు.

ఒకవేళ రైతు తన ఉత్పాదనను ఇతర పరిశ్రమకు అమ్మినట్లయితే ఏమవుతుంది?

జవాబు: కలపను అమ్మినందువల్ల వచ్చే క్రెడిట్ పాయింటును ఈ కార్డులో అతడు పొందలేడు, మరియు అతని కార్డు మరే ఇతర ప్రయోజనానికీ అర్హత పొందజాలదు.

సాధారణ షరతులు మరియు నియమ నిబంధనలు

 • రైతు కోసం కార్డు పథకము సంపూర్ణంగా ఒక స్వచ్ఛంద పథకము.
 • IPAPPM రాజమండ్రి మిల్లు యొక్క 100 కి.మీ పరిధి లోపున సరుగుడు క్లోనల్ ప్లాంటేషన్ చేపట్టువారికి ఇది వర్తిస్తుంది.
 • రైతు కోసం స్మార్ట్ కార్డు రైతుకు నిర్దిష్టమైనది, భూమికి నిర్దిష్టమైనది మరియు సంవత్సరానికి నిర్దిష్టమైనది.
 • స్మార్ట్ కార్డును జారీ చేయుటకై ఈ క్రింది రెండు ప్రాతిపదికలనూ తప్పనిసరిగా నెరవేర్చాల్సి ఉంటుంది:
  • IPAPPM CPC ల నుండి సరుగుడు క్లోనల్ నారు మొక్కలను కొనుగోలు చేసి ఉండాలి.
  • b. నారు మొక్కలను కొనుగోలు చేసిన తర్వాత, రైతు IPAPPM చే సలహా ఇవ్వబడిన సాగు పద్ధతులను పాటించాలి.
 • నారు మొక్కలను కొనుగోలు చేయు సమయములో, పేరు, కొనుగోలు చేసిన నారు మొక్కల పరిమాణము, మొక్కలను నాటబోయే భూమి విస్తీర్ణము (ఎకరాలలో) (కనీస దూరము 2.5 మీ. X 1 మీ.), ఖస్రా నంబరు (సర్వే నం)/ గ్రామము పేరుతో సహా భూమి వివరాలు వంటి వివరాలను రైతు అందిస్తారు.
 • కంపెనీచే పంపబడిన అధీకృత వ్యక్తి పొలమును సందర్శించి, చేపట్టిన ప్లాంటేషన్ ను పరిశీలిస్తారు. అధీకృత వ్యక్తి తన చేతి పరికరము ద్వారా ప్లాంటేషన్ యొక్క GPS సమన్వయతను తీసుకొంటారు. మొక్కల మధ్య దూరము మరియు మొక్కలను నాటుటకు సంబంధించి ఇతర ముఖ్యాంశాల గురించి కనుగొన్న వాటి ఆధారంగా, ఆ నిర్దిష్ట రైతుకు ఆ నిర్దిష్ట ప్లాంటేషన్ కొరకు కార్డు జారీ చేయుటకై ఆ ప్రతినిధి సిఫారసు చేస్తారు.
 • ప్రతియొక్క రైతుకోసం కార్డుకు ఆ నిర్దిష్ట సంవత్సరానికి, మరియు IPAPPM క్లోనల్ ఉత్పత్తి కేంద్రము (CPC) నుండి రైతు తీసుకొన్న నారు మొక్కల పరిమాణానికి నిర్దిష్టంగా క్రెడిట్ పాయింట్లు కేటాయించబడతాయి.
 • మొక్కలు నాటిన తేదీ నుండి మూడున్నర (3.5) సంవత్సరాల తర్వాత కార్డు యాక్టివేట్ చేయబడి, యాక్టివేషన్ చేయబడిన తేదీ నుండి ఆ యాక్టివేషన్ తదుపరి ఒక సంవత్సరం పాటు నిలిచి ఉంటుంది.
 • మొక్కలునాటిన ఎకరాలతో నిర్దిష్ట మెట్రిక్ టన్నుల కలపతో గుణించబడిన పరిమాణము ఒక్కో కార్డుకు లోడ్ చేయబడుతుంది. (IPAPPM ప్రతినిధులచే వివరించబడునట్లుగా, అత్యుత్తమ అభ్యాసాలను పాటించుటను బట్టి, సాధారణంగా ఒక ఎకరము నుండి 3.5 సంవత్సరాల వ్యవధిలో సరుగుడు క్లోనల్ కలప దిగుబడులు).
 • రైతు IPAPPM కు మాత్రమే కలప సామగ్రిని సరఫరా చేయాల్సి ఉంటుంది మరియు లెక్కించబడిన పరిమాణము క్రెడిట్ రియలైజేషన్ అర్హత పొందుటకు ఆ స్మార్ట్ కార్డు (ఆ నిర్దిష్ట ప్లాంటేషన్ కొరకు కేటాయించబడినట్టిది) కొరకు ప్లాంటేషన్ నుండి వచ్చే పరిమాణము అవుతుంది. మునుపటి అంశములో వివరించబడినట్లుగా, యాక్టివేషన్ కాల వ్యవధి 1 సంవత్సరము లోపున పంపిణీని పూర్తి చేయాల్సి ఉంటుంది.
 • క్రెడిట్ పాయింట్లకు తగిన వెయిటేజీని కల్పించడమనేది కంపెనీ యొక్క విచక్షణలో ఉంటుంది.
 • మిల్లులలోనికి కలపను తీసుకొనే సమయములో స్వైపింగ్ కొరకు కార్డును IPAPPM మిల్లుకు తీసుకొని రావాల్సి ఉంటుంది. రైతులు కలపను నేరుగా మిల్లులకు తీసుకొని రావచ్చు, లేదా తమ ఏజెంట్లు/ పంపిణీదారుల ద్వారా సరఫరా చేయవచ్చు. అయితే, మిల్లులకు చేరే ప్రతి కలప వాహనము వెంబడి కార్డును పంపించాల్సి ఉంటుంది.
 • ఆశించబడిన కనీస పరిమాణము యొక్క సరఫరాను పూర్తి చేసిన మీదట,ఆ కార్డు క్రింద తదుపరి పరిమాణము అవసరమై ఉండదు మరియు ఆశించబడిన కనీస పరిమాణము ఆధారంగా సరఫరా చేసిన కలపపై క్రెడిట్ ను లెక్కించడం జరుగుతుంది.
 • అన్ని ఆర్థిక లావాదేవీలనూ జరపాల్సి ఉంటుంది కాబట్టి, రైతు/కార్డు హోల్డరు తనకు కార్డు ఇవ్వబడిన కలపను కోసిన తర్వాత రొటేషన్ పద్ధతిలో మళ్ళీ  నాటుటకై కంపెనీ నుండి తిరిగి నారు మొక్కలను కొనుగోలు చేసినట్లయితే మాత్రమే ఇది ఏర్పడుతుంది.
 • పాత కార్డుపై తిరిగి ఈ కొనుగోలు చేసిన తర్వాత, ఈ కార్డు, ఇంతకు మునుపు సంపాదించిన క్రెడిట్ కొరకై రైతుకు డబ్బు పరమైన ప్రయోజనానికి (ఏదైనా ఉన్నచో) అర్హత పొందుతుంది.
 • రైతుకోసం కార్డు IPAPPM లిమిటెడ్ వారి ఆస్తిగా ఉంటుంది మరియు కోరినప్పుడు దానిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రైతుకోసం కార్డులను లేదా కార్యక్రమ ప్రయోజనాలను గనక దుర్వినియోగపరచినట్లయితే, సభ్యత్వమును రద్దు చేయడానికి దారి తీయవచ్చు, లేదా పొందిన ప్రయోజనాలను(ఏవైనా ఉన్నచో) ఉపసంహరించుకొని తిరిగి వాపసు చేయబడదు.
 • రైతుకోసం కార్డులు బదిలీ చేయబడవు మరియు రైతుకోసం కార్డు పథకం ప్రకారము వ్యవసాయ భూముల్లో సరుగుడు ప్లాంటేషన్లను నాటి, వాటిని పెంచేందుకై అది జారీ చేయబడిన సభ్యులు మాత్రమే వాటిని ఉపయోగించాల్సి ఉంటుంది.
 • అయినప్పటికీ, జారీ చేయబడిన కార్డు యొక్క స్వంతదారు మరణించడం లేదా ఆ భూమిని అమ్మివేయగా కొనుగోలు చేసిన కొత్త రైతు వంటి ఊహించని ఘటనలు జరిగిన పక్షములో, కార్డును ఎలా కొనసాగించాలి అనే విషయమై నిర్ణయించు హక్కును కంపెనీ కలిగియుంటుంది.
 • స్మార్ట్ కార్డు యొక్క నిర్మాణము, ప్రయోజనాలు మరియు ఇతర అంశాలను ఈ షరతులు మరియు నియమ నిబంధనలతో సహా మార్పు చేయడానికి లేదా రైతుకోసం కార్డు కార్యక్రమాన్ని ఏ సమయములోనైనా ఎత్తివేసే హక్కును IPAPPM లిమిటెడ్ కలిగియుంటుంది. ఏవేని మార్పుల గురించి సభ్యులకు తెలియజేయడానికై IPAPPM లిమిటెడ్ సహేతుకమైన కృషిని ఉపయోగించినప్పటికీ, తమకు తాముగా అతడు/ఆమె http://www.rythukosam.com/ లేదా CPC సైటుకు క్రమం తప్పని సందర్శనల ద్వారా, స్మార్ట్ కార్డు యొక్క షరతులు మరియు నియమ నిబంధనల్లో ఏవైనా జరిగిన మార్పుల గురించి ఆధునీకరించుకోవడం కార్డు హోల్డరు లేదా మరెవరికైనా ప్రాథమిక బాధ్యతగా ఉంటుంది. దానివల్ల కలిగే ఏదేని నష్టము లేదా నాశనానికి IPAPPM లిమిటెడ్ బాధ్యత వహించబోదు.
 • స్మార్ట్ కార్డు కోసం కేవలం వ్యక్తులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. కార్పొరేషన్లు, భాగస్వామ్య సంస్థలు, ట్రస్టులు, మరియు ఇతర సంస్థలు ఇందులో పాల్గొనడానికి అర్హత లేదు. ఒక్కో సభ్యుడు/సభ్యురాలు ఒక్క స్మార్ట్ కార్డును మాత్రమే కలిగియుండవచ్చు, మరియు రైతుకోసం కార్డులను ఉమ్మడిగా పొందలేరు.
 • ఒకవేళఒక స్మార్ట్ కార్డును గనక పోగొట్టుకొన్నా లేదా పాడై పోయినా, రు. 25/ల ఖర్చుతో ఒక కొత్త కార్డు జారీ చేయబడుతుంది. రైతుకోసం కార్డులు దొంగిలించబడినా లేదా పోగొట్టుకొని పోయినా IPAPPM లిమిటెడ్ జవాబుదారీ వహించదు.
 • IPAPPM ప్రతినిధిచే ప్లాంటేషన్ మరియు GPS రికార్డింగు పరిశీలించబడి, సిఫారసు చేయబడిన ఒక్కో ప్లాంటేషన్ కు తదుపరి 90 పని దినముల లోపున రైతుకోసం స్మార్ట్ కార్డు జారీ చేయబడుతుంది. ఒకవేళ సంబంధిత రైతు గనక ఆ నిర్ణీత వ్యవధి లోపున కార్డును అందుకోని పక్షములో, తదుపరి సమాచారము కొరకు అతడు IPAPPM CPC ని సంప్రదించవచ్చు.
 • ఇందుకు సంబంధించి ఒక వివాదము తలెత్తిన పక్షములో IPAPPM లిమిటెడ్ వారి నిర్ణయమే అంతిమము మరియు దానికి కట్టుబడవలసి ఉంటుంది.
 • కంప్యూటర్ హార్డ్ వేర్ లేదా సాఫ్ట్ వేర్ వల్ల జరిగే పొరపాట్లు లేదా వైఫల్యాలకు లేదా అవినీతికీ IPAPPM లిమిటెడ్ బాధ్యత వహించబోదు.
 • సభ్యుల యొక్క వ్యక్తిగత సమాచారానికి సంబంధించి గోప్యతా చట్టాల క్రింద పేర్కొనబడిన వ్యవహారాలతో ఏకీభవిస్తున్నట్లుగా నిర్ధారిస్తూ IPAPPM లిమిటెడ్ సహేతుకమైన చర్యలను అమలు చేస్తుంది. స్మార్ట్ కార్డు యొక్క ఉద్దేశ్యాల కొరకు, మార్కెటింగ్ మరియు ఉన్నతి కోసం మాత్రమే IPAPPM లిమిటెడ్ వారిచే వ్యక్తిగత సమాచారము వినియోగించుకోబడుతుంది.
 • ఈ స్మార్ట్ కార్డుల సంబంధిత విషయాలలో ఏదేని వివాదము గనక ఏర్పడితే, ఏకైక ఆర్బిట్రేటరు, ఫార్మ్ ఫారెస్ట్రీ యొక్క అధిపతి అయిన IPAPPM రాజమండ్రి వారిచే నిర్ణయము తీసుకోబడుతుంది, మరియు ఆర్బిట్రేషన్ యొక్క స్థలము రాజమండ్రిగా, ఆర్బిట్రేషన్ మరియు కన్సిలేషన్ చట్టము 1996 యొక్క నిబంధనలను అనుసరించి ఈ నిర్ణయము ఉంటుంది. వీరి తీర్పుకు అన్ని పక్షాలూ కట్టుబడి ఉండవలసి ఉంటుంది.
 • అన్ని వివాదాలూ రాజమండ్రిలోని కోర్టుల పరిధికి లోబడి ఉంటాయి. ఒక అభ్యుదయ మరియు బాధ్యతాయుత రైతుగా, సమాజము మరియు పర్యావరణము యొక్క ప్రయోజనాల కొరకు FSC FM (ఫారెస్ట్ స్టివార్డ్ షిప్ కౌన్ సిల్ – ఫారెస్ట్ మేనేజ్ మెంట్) యొక్క సూత్రాలు మరియు పద్ధతులను పాటించడానికి నేను అంగీకరిస్తున్నాను.
 • IPAPPM ప్రతినిధిచే షరతులు మరియు నియమ నిబంధనలన్నింటినీ నాకు సవివరంగా వివరించడం జరిగింది మరియు వాటిని నేను అర్థం చేసుకొని వాటన్నింటికీ సమ్మతిని తెలియజేస్తున్నాను.
 • కంపెనీ నుండి ప్రయోజనమును (ఏదైనా ఉన్నచో) నేరుగా నా బ్యాంకు ఖాతాలో జమచేసుకొనుటను సానుకూల పరచుకొను నిమిత్తము రైతుకోసం సభ్యత్వ కార్డుతో నా బ్యాంకు ఖాతాను అనుసంధానము చేయుటకై నేను నా బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఈ క్రింది వివరాలను తెలియజేస్తున్నాను.
Designed By BitraNet
Visitor Count: Visitor Count