ENGLISH
International Paper

వార్తలు & ఘటనలు

మొదటి పేజిమా గురించివార్తలు & ఘటనలు

ఆంధ్ర పేపర్ లిమిటెడ్ ఫార్మ్ ఫారెస్ట్రీ ప్రైవేట్నర్సరీలా సహకరంతో వ్యూహాత్మక మార్పుకి సిద్ధం

Team Based Working System ఫోటోలు చూడండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతుల భాగస్వామ్యంతో వ్యవసాయ భూములపై పల్ప్వుడ్తోటలను ప్రోత్సహించడానికి 1989 లో ఆంధ్ర పేపర్ లిమిటెడ్ తన ఫార్మ్ఫారెస్ట్రీ (వ్యవసాయఅటవీ)కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే సంవత్సరంలో, సంస్థ తన మొట్టమొదటి క్లోనల్ప్రచార కేంద్రాన్ని (సిపిసిలేదానర్సరీ) రాజమండ్రిలో ప్రారంభించడం ద్వారా అధిక నాణ్యతగల క్లోనల్ మొక్కలను ప్రచారంచేయడం ప్రారంభించింది.

తరువాతి మూడు దశాబ్దాలలో, సంస్థ క్లోనల్మొక్కల ఉత్పత్తి మరియు ఫార్మ్ఫారెస్ట్రీ విస్తరణలో బలమైన నెట్వర్క్లు మరియు వనరులను అభివృద్ధి చేసింది.అదే సమయంలో రాష్ట్రంలోని వ్యవసాయ సమాజంలో అధికదిగుబడి నిచ్చే సరుగుడు క్లోన్లను ప్రోత్సహించడానికి మరో నాలుగు నర్సరీలను తెరిచింది.

మిల్లు పరిసరాల్లో దీర్ఘకాలిక, సమర్థవంతమైన ధర మరియు స్థిరమైనపల్ప్వుడ్ (కాగితం-గుజ్జు తయారీకి ఉపయోగించేకలప) లభ్యత కోసం, 2018 సంవత్సరం నుండి, మిల్లుకు 150 కిలోమీటర్ల పరిధిలోఫార్మ్ఫారెస్ట్రీ కార్యకలాపాలను కొనసాగించాలని కంపెనీ నిర్ణయించింది. స్థానిక వ్యవసాయ సమాజంతో బలమైన సంబంధాలను నిర్మించడంజరిగింది. అంతేకాకుండా, సంస్థ 2018 లో దీర్ఘకాలికఫైబర్మరియు ఫారెస్ట్రీ వ్యూహాన్ని ఊహించడం జరిగింది. ఈ వ్యూహం ప్రకారం, మిల్లు నుంచి 150 కిలోమీటర్ల పరిధిలోప్రాంతం నుండి మిల్లు యొక్క అన్ని పల్ప్వుడ్జాతుల అవసరాలను ఈ ప్రాంతం నుండి వచ్చే 7-8 సంవత్సరాలలో 80% సేకరించాలని కంపెనీ లక్ష్యముగా నిర్ణయించింది. దీని ప్రకారం, క్లోన్ల ఉత్పత్తి మరియు పంపిణీకో సంసంస్థ ప్రైవేట్నర్సరీలతో సహకరించడం ప్రారంభించింది.

కడియంలోని క్లోనల్ప్రచార కేంద్రాన్ని (సిపిసి లేదా నర్సరీ) లో ఈరోజు ఉత్పత్తి చేయబడుతున్న(వేగవంతమైన మరియు ఏకరీతి పెరుగుదల యొక్క కావాల్సిన)లక్షణాలతో అధికదిగుబడి, వ్యాధి మరియు తెగులునిరోధకజాతులు, ఇప్పుడు ఈ ఎంపిక చేసిన భాగస్వామి సిపిసిలలో (నర్సరీలలో)కూడా 2019 నుండి ఉత్పత్తి చేయబడతాయి. ఈవ్యూహం సంవత్సరానికి కావలసిన క్లోనల్మొక్కల యొక్క నిరంతర మరియు పెరిగిన సరఫరాను నిర్ధారిస్తుంది మరియు మిల్లు నుండి 150 కిలో మీటర్ల వ్యాసార్థంలో నిరంతరకలపసరఫరాను నిర్ధారిస్తుంది. ప్రైవేట్సిపిసి సహకార విధానంత ద్వారా క్లోన్ (నర్సరీలు / సిపిసిల ద్వారా) ప్రచారం కోసం ఉపాధిమరియు నిరంతర ఆదాయాన్నిఅభివృద్ధి చేస్తుంది.అదే సమయంలోసమీప ప్రాంతాలలోనాణ్యమైన మొక్కలతో రైతులకు ప్రయోజనంచేకూరుస్తుంది, రవాణా ఖర్చులను తగ్గించుకుంటుంది.

టీము ఆధారితంగా పనిచేయు వ్యవస్థ

Team Based Working System ఫోటోలు చూడండి

సుస్థిరమైన అటవీ యాజమాన్యమును తయారు చేయుప్రయాణములో తాను అతినిశితంగా దృష్టిసారించే అంశాలలో ఒకటిగా IPAPPM, ప్లాంటేషన్కొరకు ప్రస్తుతమున్నవిత్తనము ద్వారా పెంచేమొక్కలతో పాటుగా సరుగుడుక్లోన్లను ప్రవేశపెట్టడంద్వారా గ్రామీణ ఆర్థిక పరిస్థితులకు మరింత అర్థవంతంగా ఎంతోకొంత చేయాలనే సంకల్పముతో ఉద్యమాన్ని ప్రారంభించింది. నేడు IPAPPM, ఆంధ్రప్రదేశ్లోని 3 జిల్లాలపరిధిలో రోజుకు 280 మంది మహిళలకు ఉపాధినికల్పిస్తూ,79 పాలీహౌస్ (క్లోనల్నారు మొక్కలను ఉంచేందుకు పాలథీన్ తోకప్పి ఉంచబడే గదులు)లను కలిగిన 5 క్లోనల్ప్రాపగేష న్సెంటర్ల (CPCs) నునడుపుతోంది. పైగా, సంస్కృతి మరియు పని ఆచరణలోని ఒక పెద్దమలుపుగా IPAPPM,జట్టు ఆధారితంగా పనిచేయు వ్యవస్థఅనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో ఒక్కొక్క పాలీహౌస్యొక్క బాధ్యత, టీము లీడరుగా వ్యవహరించే ఒక్కో మహిళకు ఇవ్వబడింది. ఈవిధంగా,‘స్వంతదనపుభావన’ ఫలితంగా జవాబు దారీలో స్పష్టత ఏర్పడడం మాత్రమేకాక, మహిళలు తమ నాయకత్వ నైపుణ్యాలను వృద్ధిపరచుకొని ఆచరణలో పెట్టేఅవకాశాన్ని కూడా పొందగలుగుతున్నారు.

క్లోనింగ్ కొరకు శూన్య శక్తి పాలీ హౌస్

క్లోనల్పద్ధతిలో మొక్కలు పెంచడానికి పొగమంచు(ధూమము) ఉండేగదులు,పెరుగుదల ఉండే గదులు అవసర మవుతాయి. తేమ మరియు ఉష్ణోగ్రతలనుని యంత్రించి, ఏపుగా పెరుగుదల కొరకు అధికశక్తిలే దాశక్తి వనరులను పాలీహౌస్ అందించింది.

ఒక సులువైన పాలీహౌస్ద్వారా IPAPPM,ఒక సృజనాత్మక మొక్కల క్లోనింగ్పద్ధతిని అవలంబించింది. శక్తిలేదా విద్యుత్సరఫరాలేకుండా నేమారుమూల ప్రాంతాలలో సైతమూ దానిని ఏర్పాటు చేయవచ్చు. పాలథీన్షీట్లను మరియు స్థానికంగా లభించే ఊతము నిర్మాణాన్ని ఉపయోగించి చాలా స్వల్ప ఖర్చుతో రూపొందించే ఈ నిర్మాణాలను శూన్యశక్తి పాలీహౌస్లు అంటారు. పాలీ హౌస్యొక్క చుట్టూ నీటికాలువలను త్రవ్వి, వాటిని నీటితోనింపి అందువల్ల వచ్చే నీటి ఆవిరి ద్వారా ఈగదులలో పొగమంచు ఉత్పత్తి చేయబడుతుంది. పగటిపూట ఉండే ఎండ వేడిమిని ఉపయోగించుకొని ఈకాలువల్లోని నీరు ఆవిరిఅయి, ధూమములాగా ఏర్పడుతుంది. ఇందువల్ల, ఆ నిర్మాణములోపల మొక్కలు వేర్లు పోసుకొని ఎదిగేందుకు కావలసిన హ్యుమిడిటీ (గాలిలోతేమ) ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ, ఎటువంటి విద్యుత్వనరులనూ ఉపయోగించుకోవాల్సిన అవసరం లేకుండానే అత్యుత్తమక్లోన్లను ఉత్పత్తి చేసేందుకు తగినంత ఉష్ణోగ్రతను మరియు గాలిలో తగినతేమను కల్పిస్తుంది.

Designed By BitraNet
Visitor Count: Visitor Count