సరుగుడుచెట్లను విత్తనాల నుండి లేదా క్లోనల్ వ్యాప్తి పద్ధతి ద్వారా పెంచవచ్చు. తీరప్రాంతము (సముద్ర తీరము) వెంబడి బలమైన గాలులు మరియు ఉప్పుకు అడ్డుపడి తీరప్రాంత గ్రామాలకు రక్షణ కల్పించడమే సరుగుడుయొక్క అతిపెద్ద వినియోగముగా ఉంది. అయినప్పటికీ, నివేదికల ప్రకారము సరుగుడు వల్ల అనేక ఇతర ఉపయోగాలున్నాయి. దాని ప్రధాన కాండము వివిధ పరిశ్రమలకు కొయ్య స్థంభాల కోసం లేదా కలప గుజ్జు కోసం అమ్మకం జరుగుతుండగా, కొమ్మలు వంటచెరకుగా ఉపయోగపడుతున్నాయి. అత్యధిక వేడిమితో మండే దీని కొయ్య ప్రపంచములోనే అత్యుత్తమ వంటచెరకుగా విశ్వసించబడుతోంది. అది చార్ కోల్ కు కూడా ఒక మంచి వనరుగా ఉంది. చైనాలో ఈ కొయ్యను ఇటుకల బట్టీలను కాల్చడానికి వాడుతున్నారు. కొయ్య స్థంభాలు మరియు కలప గుజ్జుగా కూడా, కోస్తా ఆంధ్రలో IPAndhra Paper Limited ప్రవేశపెట్టిన సరుగుడుక్లోనులు సగటున ఎకరానికి 60 మెట్రిక్ టన్నుల దిగుబడిని (నిర్ణీత సాగు పద్ధతులను పాటించిన పరిస్థితుల్లో) ఇస్తున్నాయి. కలప గుజ్జు రకాల పైకి ఇది గణనీయంగా అత్యధిక దిగుబడి. అది వదులైన ఇసుక భూముల్లో చాలా బాగా పెరుగుతుంది. అయినప్పటికీ, అది ఎర్ర నేలలు, ఆమ్ల మరియు క్షార భూముల్లో సైతమూ పెరుగుతుంది. ఇది పెరుగుదలయొక్క తర్వాతి దశలో కూడా కరవుకు తట్టుకొంటుంది.
ఏది ఏమైనప్పటికీ,బాల్య దశలోఇది నీటి నిలకడను తట్టుకోలేదు కాబట్టి,సరుగుడు పంట వేయబోయే ముందుగా, ఆ భూమియొక్క మురుగునీటి పారుదల స్థితిని తప్పనిసరిగా మనసులో ఉంచుకోవాలి.
లేదు, సరుగుడుచెట్లనుఅన్ని రకాల భూముల్లోనూ పెంచవచ్చు(ప్లాంటేషన్ లో తగిన సాగు పద్ధతులను పాటించినప్పుడు)
సరుగుడుక్లోనుల సరాసరి దిగుబడి 60-70 మెట్రిక్ టన్నులు (ప్లాంటేషన్ లో తగిన సాగు పద్ధతులను పాటించినప్పుడు)
The period of harvest is 4 years after the planting.
మొక్కలునాటిన తర్వాత 4 సంవత్సరాలకు కోతకు వస్తుంది.
సరుగుడుకు అవసరమైన స్థల దూరము 3 మీటర్లు x 1 మీటరు. వరుసల మధ్య 3 మీటర్లుమరియు వరుసలో మొక్కల మధ్య 1 మీటరు.
ఎకరా భూమికి సిఫారసు చేయబడిన మొక్కల సంఖ్య-1600.
సరుగుడు జుంఘూనియానా వంటి రకాలకు పిలకలను ఇచ్చే సామర్థ్యం ఉన్నదని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే,సరుగుడుఈక్విసెటిఫోలియా మాత్రం పిలకలను ఇవ్వనే ఇవ్వదు. పైగా ఏ సరుగుడురకములోనైనా పిలకలు చాలా బలహీనంగా పెరుగుతాయి. రైతులకు అది ఎంతమాత్రమూ ఆర్థికంగా లాభసాటి కానే కాదు.
నాణ్యమైన క్లోనల్ నారు మొక్కలు మరియు క్షేత్ర సాంకేతిక సలహాలు మరియు సిఫారసులు
1. సరుగుడు యొక్క నాణ్యమైన క్లోనల్ నారు మొక్కలు,
2. అత్యుత్తమంగా నాటే అభ్యాసాలపై సాంకేతిక సలహాలు.
సరుగుడునత్రజనిని స్థిరీకరించే చెట్టు మరియు అత్యంత అధ్వాన్న భూపరిస్థితిలో కూడా ఇది పెరగగలుగుతుంది. కావున,సరుగుడులో అంతర పంట ఎల్లప్పుడూ ఇతరపంటకు ప్రయోజనాన్ని అందిస్తుంది. సిఫారసు చేయబడిన సాగు పద్ధతులను పాటిస్తూ కేవలంసరుగుడుక్లోన్లను మాత్రమే పెంచడం వల్ల సరుగుడు మొక్కలు నాటిన 3.5 సంవత్సరాల తర్వాత ఎకరాకు 60 నుండి 70 మె.టన్నుల వరకూ దిగుబడినిస్తుంది.ఇతర పంటలు కూడా స్థలాన్ని తీసుకొంటాయి కాబట్టి, అంతరపంట వేయడం వల్ల ఎకరా నుండి వచ్చే సరుగుడు దిగుబడిని అది కచ్చితంగా తగ్గిస్తుంది. అయినప్పటికీ, రైతులు 3.5 సంవత్సరాల కాలము ఎదురు చూడనవసరం లేకుండా ఆ పొలం నుండి కొంత ఆర్థిక రాబడిని పొందగలుగుతారు. అందువల్ల, రెండు విధాలు కూడా ప్రయోజనకరమే. అంతరపంట వేయడంపై అంతిమ నిర్ణయము రైతుదే అవుతుంది.
పొగాకు, ప్రత్తి, కూరగాయలు, మిర్చి, వేరుశెనగ మరియు పుచ్చ పంటలు సిఫారసు చేయబడ్డాయి. సరుగుడుతో విజయవంతమైన అంతర పంటలుగా (వివిధ రకాల నేలలను బట్టి) బెండ, నువ్వులు, వేరుశెనగ మరియు పుచ్చకాయ అని ఇంటర్నెట్ లో వివిధ పరిశోధనలు ఉన్నాయి.
IPAndhra Paper Limited క్లోనల్ ఉత్పత్తి కేంద్రాలు (రాజమండ్రి, ములగపూడి & తీడ (నర్సీపట్నం) దేవీపురం(అనకాపల్లి)మరియు జరుగుమల్లి (ఒంగోలు)
అవును. మొక్కలు చిన్నవిగా ఉన్న మొదటి సంవత్సరములో సరుగుడుక్లోనల్ ప్లాంటేషన్లకు నీటి పారుదల వసతి అవసరమవుతుంది. ఆ తర్వాత వేరు వ్యవస్థ బలపడి తక్కువ నీటి లభ్యతతో కూడా అది నిలదొక్కుకో గలదు. మరీ ముఖ్యంగా, నేలపై నీటి నిలువ ఉండకూడదు. ఒకవేళ మొదటి సంవత్సరములో కూడా నీటి పారుదల వసతి లేని పక్షములో,తొలి ఋతుపవనాల సందర్భంగానే మొక్కలను నాటవలసి ఉంటుంది.
ఈ క్రింది అంశాల ఆధారంగా ఒక రైతు యొక్క క్రెడిట్లు ఎలా లెక్కించబడతాయో తెలుసుకోవడానికి ఈ క్రిందిది చక్కని ఉదాహరణ.అంశాల వారీగా విలువలను నింపి మీరు క్రెడిట్లను లెక్కించవచ్చు:
సరుగుడు | ప్రత్యామ్నాయ పంట 1 | ప్రత్యామ్నాయ పంట 2 | ||
---|---|---|---|---|
వ.నం. | అంశము | ఖర్చులు | ఖర్చులు | ఖర్చులు |
1 | మొత్తం ఎకరాలు | |||
2 | మొక్కల ఖర్చు మొత్తం (రూ.) | |||
3 | 4 సంవత్సరాల్లోఎరువులు (రూ.) | |||
4 | 4 సంవత్సరాల్లో పురుగు మందులు (రూ.) | |||
5 | కూలీలు | |||
a | మొక్కలు నాటుట (రూ.) | |||
b | మొత్తం నిర్వహణ ఖర్చు (రూ.) | |||
6 | కోత వృత్తము(సం.రాలలో) | |||
మొత్తము ఖర్చు (రూ.) | ||||
టన్ను అమ్మకంధర (రూ.) | ||||
దిగుబడి టన్నులు(మెట్రిక్ టన్నులు) (రూ.) | ||||
మొత్తం ఆదాయము (రూ.) | ||||
నికర లాభము (రూ.) | ||||
ఏడాదికి నికర లాభము (రూ.) | ||||
లాభము/ఎకరానికి/ఏడాదికి (రూ.) |
సుబాబుల్ లాగా సరుగుడునత్రజనిని స్థిరీకరించే రకము. అందువల్ల నేలలో భూసారము పెరుగుతుంది. కాబట్టి ఇతర పంటలతో సాగు చేయడానికి ఇది తరచుగా ప్రాధాన్యత ఇవ్వబడుతున్న రకము. సరుగుడుతో అత్యుత్తమ అంతరపంటను కనుక్కొనేందుకై వివిధ అధ్యయనాలను చేపట్టడమైనది. ఒకదానితో మరొకటి పరస్పరము పోటీ పడకుండా సరుగుడుతో బాగా పెరిగే కొన్ని అంతరపంటలుగా నువ్వులు, బెండ, వేరుశెనగ, పొగాకు మరియు టొమాటో అనే పంటలను కనుక్కోవడమైనది.
ప్రధానంగా సముద్రతీర ప్రాంతాలు, ఉష్ణ మండల మరియు సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో ప్రత్యేకించి వేడి, గాలిలో తేమ ఉండే ప్రాంతాలలో సరుగుడువేగంగా పెరిగే చెట్టు.దీనికి తేలికపాటి పోషకాల అవసరం ఉంటుంది మరియు అత్యుత్తమ పెరుగుదల మరియు వృద్ధికై ప్రకాశించే ఎండ అవసరమవుతుంది. ఇది ఒక బహుళార్థ ప్రయోజనకరమైన చెట్టు. దీనిని వంటచెరకుగా, సెంటరింగ్, ఇంటి పైకప్పు వేయుట కొరకు కొయ్య స్థంభాలుగా వాడతారు. వేర్లను ఇటుకల తయారీ పరిశ్రమలో కాల్చడానికి ఉపయోగిస్తుండగా,కలప గుజ్జు మరియు కాగితం పరిశ్రమలకు ఇది అత్యుత్తమ ముడి సరుకుల్లో ఒకటిగా వినియోగించబడుతోంది.
స్థలములో మురుగు నీరు పారుదల బాగా ఉండాలి. సాధ్యమైనంతవరకూ నేల తేలికైనదిగా, బాగా నీరు ఇంకేదిగా అనగా., ఇసుకనేల/ఇసుకపొర/గరుగు మరియు ఎర్ర ఒండ్రు నేలలు సరుగుడు సాగుకు చాలా అనుకూలమైనవి. బంకమట్టి నేలల్లో ఇది అంత బాగా పెరగదు. అయినప్పటికీ, నిర్ణీత అంతరాలలో క్రమం తప్పకుండా దున్నకం, మరియు కలుపు త్రవ్వడం వంటి ప్రత్యేక యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా నేల ఎల్లప్పుడూ నీరు ఇంకడానికి అనువుగా ఉంటుంది కాబట్టి,ఆ స్థితిలో దీనిని బంకనేలల్లో కూడా పెంచవచ్చు.
అన్ని రకాల కలుపు మొక్కలు, పొదలు, ముళ్ళకంపలు, మరియు పొలములో పడి ఉన్న పనికిరాని మొక్కలను తొలగించి శుభ్రం చేయండి.
మౌల్డ్ బోల్డ్/డిస్క్ ను ఉపయోగించి నేలను బాగా లోతుగా దున్ని, తర్వాత రెండుమార్లు కల్టివేటరుతోఅడ్డము అడ్డముగా దున్నాలి.
నర్సరీ నుండి గ్రేడు చేయబడిన మరియు బాగా ధృఢంగా ఉన్న, అనగా 120 రోజుల వయసు గల నారు మొక్కలను మాత్రమే రైతులకు అందించాలి.నారుమొక్కలను తీసుకువెళ్ళడానికి కనీసం వారము రోజుల ముందుగా గ్రేడింగ్ చేయాలి. వాహనములోనికి మొక్కలను ఎత్తే ముందుగా వాటికి బాగా నీరు పెట్టాలి. పొలములో దించిన తర్వాత, మొక్కలకు నీరు పెట్టి, మొక్కల తట్టల మధ్య తగినంత స్థలము వదిలి నేరుగా ఎండ తగిలే చోటులో ఉంచాలి. వర్షాలు లేక మొక్కలు నాటడం పూర్తి కాని పక్షములో, ప్రతిరోజూ రెండు మార్లు మొక్కలకు తడి ఇవ్వండి.
బ్లాక్ ప్లాంటేషన్ కొరకు - 2.5 మీ. X 1.0 మీ / 3.0 మీ X 1.0 మీ. (ఎకరానికి 1600/ 1333 మొక్కలు)
పొలంగట్లపై నాటుట కొరకు (ఒకే వరుస) - 1.0 మీ. (ఎకరానికి250 మొక్కలు)
తాడు మరియు కర్రలను ఉపయోగించి సరియైన విధంగా అలైన్ మెంట్ చేయాలి. ప్రతియొక్క వరుస కూడా నిటారుగా పెరిగేట్లుగా అవసరమైన దూరములో ఊతకర్రలను ఏర్పాటు చేయాలి.
ఒక లీటరు నీటికి 2 మి.లీ ల క్లోరోఫైరిఫాస్ మందును కలిపి నేలపై చల్లాలి మరియు గుంతకు బయట భాగములోనూ మరియు లోపలి నాలుగు గోడలకూ చల్లాలి. క్లోరోఫైరిఫాస్ లభించని పక్షములో, ఫోరేట్ 10G గుళికలు ఒక్కో మొక్కకు 5-10 గ్రా. వంతున వేయాలని సలహా ఇవ్వబడుతోంది.
వేరుకు ఉన్న మట్టి ముద్దను కదల్చకుండా రూట్ ట్రైనర్లతో మొక్కను బయటకు తీయాలి. మొక్కలను బాగా లోతుగా నాటి, నాటిన తర్వాత మట్టిని గట్టిగా త్రొక్కాలి.మొక్కలు నాటేటప్పుడు ఒక్కో మొక్కకు ఒక లీటరు వంతున నీరు పోయండి. ఒకవేళ వర్షం పడకపోయినా, లేదా ఎక్కువ రోజులు వరపు ఏర్పడినా అప్పుడు మొక్కలకు తడిని ఇవ్వండి.
మొక్కలు నాటిన ఒక నెల లోపున వేర్లు బాగా చొచ్చుకుపోయి, కొత్త ఆకులు తొడగడం ప్రారంభిస్తాయి. అప్పుడు తగు విధంగా కలుపుతీత మరియు మొక్కల చుట్టూ త్రవ్వకం చేయాలి. మొక్కల చుట్టూ 30-45 సెం.మీ వ్యాసార్ధములో పట్టీ కలుపుతీత మరియు త్రవ్వకము చేయాలి.ఒక్కో మొక్కకు 30 గ్రాముల వంతున DAP ఎరువును వేసి, ఒక నెల తర్వాత మరోసారి ఒక్కో మొక్కకు 20 గ్రాముల యూరియాతో DAP ఎరువును వేయండి. ఒకవేళ సూక్ష్మపోషకపదార్థాల లోపము గనక ఉంటే, మా క్షేత్ర సిబ్బందిని సంప్రదించి, వారి సలహాతో వాటిని వేయండి. ఎరువులు వేసే సమయములో, దయచేసి నేలలో సమృద్ధిగా తేమ ఉండేట్లు చూడండి. మొదటి సంవత్సరములో కనీసం 2-3 మార్లుకలుపుతీత మరియు త్రవ్వకం అవసరమవుతుంది.
మొదటి సారి కలుపు తీయునప్పుడు, అనగా మొక్కలు నాటిన 25-30 రోజుల తర్వాత చనిపోయిన మొక్కల స్థానములో కొత్త మొక్కలను నాటాల్సి ఉంటుంది.
మొక్కలు నాటిన తర్వాత ఒకవేళ వర్షాలు పడకపోయినా, లేదా ఎక్కువ రోజులు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, మొక్కలకు చేతి నీరు పోయాల్సి ఉంటుంది. ప్లాంటేషన్ యొక్క దిగుబడి మెరుగు పడటంలో నీరు ఇవ్వడమనేది చాలా సహాయకారిగా ఉంటుందనేది సాధారణ గమనాంశము.
ఋతుపవనాలు ముగిసే ముందుగా రెండు వరుసలలోని మొక్కల మధ్య నేలను దున్నాలి.
రైతులుసాధ్యమైనంత వరకూ వివిధ వ్యవసాయ అటవీ పెంపక నమూనాల క్రింద స్థానిక సాంప్రదాయ పంటలలో నుండియే అంతర పంటను ఎంచుకోవాలి. మొదటి సంవత్సరములో, మినుములు, పెసర, మిరప, వేరుశెనగ, పొగాకు, పుచ్చకాయ మున్నగు తక్కువ ఎత్తు పెరిగే పంటను అంతరపంటగా సాగు చేసుకోవాలి.
పశువులు మేయడం లేదా జంతువులు ప్రవేశించి పాడు చేయడం వంటి వాటి నుండి రక్షణకై, ప్లాంటేషన్ చుట్టూ “పశువులు చొరబడని కందకము (CPT)” త్రవ్వాలి లేదా తాత్కాలిక కంచెను ఏర్పాటు చేయవచ్చు.
వేసవి కాలములో ప్లాంటేషన్ ప్రదేశములో ఏ విధమైన ఎండు గడ్డి ఉండకూడదు. అటువంటి అగ్ని ప్రమాద కారక పదార్థాలు లేకుండా స్థలమును బాగా శుభ్రం చేసి ఉంచాలి. ఆ ప్రదేశములో అగ్ని ప్రమాదము జరిగే అవకాశం ఉన్న పక్షములో, అగ్ని చొరబాటుకు వీలు లేని పట్టీ రేఖల్ని నిర్ణీత అంతరములో ఏర్పరచండి.
3వ మరియు 4 వ సంవత్సరాల్లో అవసరాన్ని బట్టి నిర్వహణ చేసుకోవాల్సి ఉంటుంది.
మీరు ఈ ప్రదేశంలో మమ్మల్ని కలవడానికి లేదా మీ లొకేషన్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మా సిబ్బందిని సంప్రదించి, మీ మొక్కలు నాటే ప్రదేశానికి సమీపంలో క్యాజురినా క్లోనల్ ఫార్మింగ్ మరియు నర్సరీ పంపిణీ గురించి అర్థం చేసుకోవచ్చు.
సమావేశతేదీ | జిల్లా | మండలం | గ్రామం | కంపెనీసిబ్బంది | సంప్రదించండి |
---|---|---|---|---|---|
25-Jul-2022 10:00 AM | తూర్పుగోదావరి | గొల్లప్రోలు | కొడవల్లి | పి.శ్రీకాంత్ | 8498097632 |
25-Jul-2022 10:00 AM | పశ్చిమగోదావరి | పెదవేగి | వేగివాడ | ఆర్.కృష్ణ | 8498097662 |
25-Jul-2022 11:00 AM | పశ్చిమగోదావరి | నరసాపురం | సీతారామపురం | రవి తేజ | 9866494088 |
25-Jul-2022 02:00 PM | తూర్పుగోదావరి | ప్రత్తిపాడు | తాడువాయి | పి.శ్రీకాంత్ | 8498097632 |
26-Jul-2022 11:00 AM | తూర్పుగోదావరి | జగ్గంపేట | ఇర్రిపాక | పి.శ్రీకాంత్ | 8498097632 |
26-Jul-2022 04:00 PM | తూర్పుగోదావరి | అల్లవరం | మొగళ్లమూరు | ఎన్.దుర్గా | 8498097652 |
27-Jul-2022 08:00 AM | తూర్పుగోదావరి | మారేడుమిల్లి | పాములమామిడి | కె.రామకృష్ణ | 8498097983 |
27-Jul-2022 04:00 PM | తూర్పుగోదావరి | గంగవరం | నెల్లిపూడి | కె.రామకృష్ణ | 8498097983 |
28-Jul-2022 10:00 AM | తూర్పుగోదావరి | అడ్డతీగల | డిభీమవరం | కె.రామకృష్ణ | 8498097983 |
28-Jul-2022 10:30 AM | తూర్పుగోదావరి | శంఖవరం | శంఖవరం | ఎ.కళ్యాణ్ | 9493202991 |
28-Jul-2022 11:00 AM | తూర్పుగోదావరి | అడ్డతీగల | అడ్డతీగల | N.S.M.V శాస్త్రి | 8498097639 |
28-Jul-2022 04:00 PM | తూర్పుగోదావరి | అడ్డతీగల | రావులపాలెం | కె.రామకృష్ణ | 8498097983 |
29-Jul-2022 08:00 AM | పశ్చిమగోదావరి | మొగల్తూరు | పేరుపాలెం | బి.గంగాధర్ | 8498097982 |
29-Jul-2022 11:00 AM | పశ్చిమగోదావరి | నరసాపురం | తుర్పుటల్లు | రవి తేజ | 9866494088 |
29-Jul-2022 12:30 PM | తూర్పుగోదావరి | దేవీపట్నం | పెదభీంపల్లె | N.S.M.V శాస్త్రి | 8498097639 |
30-Jul-2022 11:30 AM | పశ్చిమగోదావరి | గోపాలపురం | గోపాలపురం | రవి తేజ | 9866494088 |
30-Jul-2022 04:00 PM | పశ్చిమగోదావరి | జీలుగుమిల్లి | కామయ్యకుంట | కె.వెంకటేష్ | 9908203005 |